టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే ఆమె వరదబాధితులకు అండగా నిలుచున్న విషయం తెలిసిందే. తనవంతు రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఇప్పుడు అలాంటి మరో గొప్ప పని చేశారు అనన్య. రోడ్డుపై నిరాశ్రియులుగా ఉండే వారికి ఆమె సహాయాన్ని అందించారు. చలి తీవ్రత నుండి తట్టుకోవడానికి తానే స్వయంగా వెళ్లి అలాంటి వారికీ దుప్పట్లు అందజేసింది. అది చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనన్య నాగళ్ళ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె నటించిన పొట్టేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూరల్ బ్యాక్డ్రాప్ లో దర్శకుడు సాహిత్ మోతుకూరి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక త్వరలోనే ఓటీటీలోకి రానుంది ఈ మూవీ.