Anasuya Bharadwaj : అనసూయ ట్విట్టర్‌లో తిట్టింది ఆ హీరోనేనా..
Anasuya Bharadwaj : యాంకర్, నటి అనసూయ ఏది మాట్లాడినా లేక ట్వీట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది;
Anasuya Bharadwaj : యాంకర్, నటి అనసూయ ఏది మాట్లాడినా లేక ట్వీట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఆమె ఎవరినో ఉద్దేశిస్తూ.. 'అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ కొన్ని సార్లు రావడం లేటవొచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా' అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై అనసూయ ఫ్యాన్స్ ఇంకా నెటిజన్స్ పెద్ద కన్ఫ్యూజన్‌లో పడ్డారు. అనసూయ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు. ఎవరిని అన్నారు అనసూయ మేడం అని కొందరు కామెంట్ చేసినా అనసూయ స్పందించలేదు. కానీ కామెంట్స్ చదువుతుంటే.. అనసూయ ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నదో తెలిసిపోతుంది.
అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022