Anasuya Bharadwaj: కోలీవుడ్‌లో అనసూయ ఎంట్రీ.. అది కూడా హీరోయిన్‌గా..
Anasuya Bharadwaj: తాజాగా ఈ జబర్దస్త్ భామ తమిళంలో కూడా అడుగుపెట్టనుంది.. అది కూడా హీరోయిన్‌గా.;
Anasuya Bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ.. యాంకర్‌గా మాత్రమే కాకుండా యాక్టర్‌గా కాకుండా తనను తాను నిరూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎన్నో సినిమా ఛాన్సులు వస్తున్నా కూడా సెలక్టివ్‌గా తన పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. తాను ఏ సినిమా చేసినా.. అందులో తన మార్క్ ఉండిపోయేలా చూసుకుంటుంది. తాజాగా ఈ జబర్దస్త్ భామ తమిళంలో కూడా అడుగుపెట్టనుంది.. అది కూడా హీరోయిన్‌గా.
ప్రభుదేవ ఒక మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు.. యాక్టర్, డైరెక్టర్‌గా కూడా ఇప్పటికి ఎన్నో సినిమాలతో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అన్ని పక్కన పెట్టి హీరోగానే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తన తరువతి సినిమా గురించి ఇటీవల ఒక అప్డేట్ విడుదలయ్యింది. ప్రభుదేవ అప్‌కమింగ్ మూవీకి 'ఫ్లాష్‌బ్యాక్' అనే టైటిల్ ఖరారయ్యింది. అంతే కాక ఈ సినిమా నుండి రెండు పోస్టర్లు కూడా విడుదల చేసింది మూవీ టీమ్.
ఫ్లాష్ బ్యాక్‌తో మొదటిసారిగా ప్రభుదేవతో జోడీకడుతోంది రెజీనా. తెలుగు, తమిళంలో ఆఫర్లు కరువైన రెజీనాకు ఇది మరో ఛాన్స్ అనే చెప్పవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ లుక్‌లో రెజీనా ఎప్పటిలాగానే సరదాగా కనిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ మూవీ టీమ్ అందరిలాగా కాకుండా వెరైటీగా రెండు ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేసింది. అందులో ఒకదాంట్లో రెజీనా, ప్రభుదేవా ఉండగా.. మరో పోస్టర్ మాత్రం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.
అనసూయ తమిళంలో ఎంట్రీ ఇవ్వనుందని, అది కూడా హీరోయిన్‌గా ప్రభుదేవ పక్కన నటిస్తుందని ఫ్లాష్ బ్యాక్ సినిమా పోస్టర్ విడుదలయ్యే వరకు చాలామందికి తెలీదు. ఈ మూవీ నుండి విడుదలయిన ఫస్ట్ లుక్‌లో ఈ విషయం స్పష్టమయింది. ఇది చూసిన అనసూయ ఫ్యాన్స్.. కోలీవుడ్‌లో కూడా తన మార్క్‌ను క్రియేట్ చేయాలని ఆశిస్తున్నారు.