తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి నటి అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై ఓ వేదిక మీద ఆమె స్పందించారు. ఓ స్టార్ హీరో అడిగితే తాను 'నో' చెప్పానని అనసూయ వెల్లడించారు. అదే విధంగా ఒక పెద్ద డైరెక్టర్ కూడా అడిగితే సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. దీనివల్ల తాను పలు ఆఫర్లను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. నో చెప్పడమే కాదు... దాని వల్ల వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిల్లో ఉండాలని సూచించారు. అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు వాడుకోవడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే తనకు ప్రపోజ్ చేశారని... తాను తిరస్కరించానని అనసూయ చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు. అమ్మాయిలు కూడా ఈజీ వేలో ఛాన్సులు రావాలని కాకుండా... కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నించాలని అనసూయ సూచించింది.