వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 3వ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ నెల 14న రానున్న ఈ మూవీ ప్రమోషన్ల సందర్భంగా అనిల్ పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇద్దరు లేడీస్ మధ్య వెంకటేశ్‌గారు ఇబ్బంది పడితే ఆ సినిమా పక్కా సూపర్ హిట్. మా సినిమాకు, సంక్రాంతికి సంబంధం ఉంది. అందుకే ఆ పేరు పెట్టాం. వెంకటేశ్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మున్ముందు ఓ 10, 12 సినిమాలు ఆయనతో చేస్తానేమో’ అని పేర్కొన్నారు.
గత ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ నిరాశ పరిచారు. కానీ అనిల్ రావిపూడి గత చిత్రం భగవంత్ కేసరి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఫ్లాప్ లేకుండా కెరీర్‌లో ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ కొట్టడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సినిమా కోసం నటీ నటులు, దర్శకుడు చేసిన ప్రమోషన్ చాలా హెల్ఫ్ అవుతుంది. కచ్చితంగా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ప్రేక్షకులు సైతం పాజిటివ్‌గానే ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.