ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఇది రూమరా లేక నిజమైన వార్తా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఈ న్యూస్ మాత్రం ఒక సంచలనంగా మారింది. నిజంగా ఈ కాంబినేషన్ గురించి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఆ కారణంగానే ఇది రూమర్ అని చాలామంది కొట్టి పడేస్తున్నారు. ఇంతకీ ఈ సెన్సేషనల్ డైరెక్ట్ చేయబోయే అక్కినేని హీరో ఎవరు అనుకుంటున్నారా.. అఖిల్. యస్.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ హీరోగా నటించబోతున్నాడు అనే న్యూస్ వినిపిస్తోంది. పైగా ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోన్న మూవీ అని ఆల్రెడీ అనిల్ అనౌన్స్ చేశాడు. దీంతో ఈ కాంబో గురించి మరింత హైప్ పెరుగుతోంది.
అక్కినేని అఖిల్ కెరీర్ మొదలు పెట్టి చాలా కాలం అవుతోంది. అయినా ఇంత వరకు సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. ఒకట్రెండు మాత్రం చిన్న విజయాలు పడ్డాయి. బట్ అవి అతనికి సరిపోలేదు. ప్రస్తుతం లెనిన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ మే 1న విడుదల కాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై అంచనాలున్నాయి. అయినా అఖిల్ కు హిట్ పడుతుందా అనే డౌట్స్ ఉన్నాయి. అలాంటి టైమ్ లో అనిల్ రావిపూడి పేరు వినిపించడం మాత్రం నిజంగా హైలెట్.
అనిల్ రావిపూడి కొన్నాళ్లుగా సంక్రాంతి డైరెక్టర్ గా మారిపోయాడు. అతను ప్రతి సంక్రాంతికి తిరుగులేని బ్లాక్ బస్టర్స్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఈ యేడాది మన శంకర వరప్రసాద్ తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. ఆ కారణంగా అఖిల్ తో మూవీ అనేది మాత్రం చాలా చాలా పెద్ద విషయం అని చెప్పాలి. కాకపోతే ఇది నిజంగా రూమరా లేక రియలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.