WAR2 trailer : 25 యేళ్ల హీరోలు, 25న ట్రైలర్

Update: 2025-07-22 07:05 GMT

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఓ ఐకనిక్ మూమెంట్ ను షేర్ చేసుకుంది. ఈ బ్యానర్ లో రూపొందిన వార్ 2 మూవీ ట్రైలర్ విడుదల చేయబోతున్నాం అని చెబుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ను అనౌన్స్ చేసింది. ముందుగా ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 23న విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ కూడా దాన్ని ఖండించలేదు. అయితే ఆ డేట్ మారింది. వార్ 2 ట్రైలర్ ను 25న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించింది నిర్మాణ సంస్థ. అందుకు కారణం కూడా బలే చెప్పింది.

వార్ 2 హీరోలైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లు హీరోలుగా మారి ఈ యేడాదితో 25 యేళ్లు పూర్తవుతుంది. ఇండియన్ సినిమాకు సంబంధిందించిన ఇద్దరు ఐకనిక్ హీరోల జర్నీని గుర్తు చేస్తూ మా ట్రైలర్ ను ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నాం అని అనౌన్స్ చేశారు. ఓ రకంగా ఇది ఆ ఇద్దరు సిల్వర్ జూబ్లీ స్పెషల్ ట్రిబ్యూట్ అని కూడా అనుకోవచ్చేమో. ట్రైలర్ కూడా అదే రేంజ్ లో కట్ చేశారు అని టాక్ కూడా ఉంది.

మొత్తంగా ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న వార్ 2 పై సాలిడ్ అంచనాలు పెంచడంలో టీమ్ విఫలమైంది. ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయని.. ప్రమోషన్స్ కూడా దేశవ్యాప్తంగా ప్లాన్ చేశారట. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ లో కియారా అద్వానీ నటించింది. 

Tags:    

Similar News