సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. కృష్ణ వారసుడుగా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడు. రమేష్ బాబు నటుడుగా స్టార్డమ్ తెచ్చుకోలేకపోయాడు. కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు రమేష్ బాబు. మహేష్ బాబుకు అన్నయ్య అంటే చాలా ఇష్టంతో కూడిన గౌరవం. ఆయన సోదరుడి కొడుకును హీరోగా లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో జయకృష్ణ నటనలో శిక్షణ తీసుకున్నాడు. యూఎస్ లో ఓ యాక్టింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చాడట. మంచి మేకోవర్ తో కనిపిస్తున్నాడట. లేటెస్ట్ గా చేసిన ఫోటో షూట్ చూసి మనోడిలో స్టార్ ఉన్నాడు అంటున్నారు.
తన తాత, బాబాయ్ లాగా స్టార్డమ్ తెచ్చుకునేందు ప్రయత్నిస్తా అంటున్నాడు. ప్రస్తుతం జయకృష్ణ లాంచింగ్ కోసం కథలు వింటున్నారు. అతనికి సరిపోతుంది అనిపించిన కథ పడితే అప్పుడు ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. మరి ఇండస్ట్రీ నుంచి అతన్ని పరిచయం చేసే లక్ ఎవరికి దక్కుతుందో చూడాలి. అంటే కొత్త దర్శకులకు అవకాశం ఇస్తారా లేక మహేష్ లాగా ఓ సీనియర్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏదేమైనా కుర్రాడు బానే ఉన్నాడు మరి.