తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలకృష్ణ, హరికృష్ణ ఇలా ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. తాజాగా ఈ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాను వైవీఎస్ చౌదరి తెరకెక్కించనున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైవీఎస్ చౌదరి ప్రకటించారు. అంతేకాదు సినిమా నుంచి తారకరామారావు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ లుక్ కి ఆడియన్స్ నుండి కూడా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా వెచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.