నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. కొన్నాళ్లుగా అపజయం అనే మాటా లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే గతేడాది వచ్చిన అఖండ 2 విషయంలో కొంతమంది ఓవరాక్షన్ వల్ల కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ మూవీపై కావాలని కొందరు నెగెటివ్ చేశారు. ట్రోల్స్ చేశారు. ఈ కారణంగా వసూళ్లు ఇబ్బంది పడ్డాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు బాలయ్య. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ మూవీ స్టార్ట్ చేశారు. ఓపెనింగ్ కూడా అయింది. అయితే ఇదో హిస్టారికల్ మూవీ. పీరియాడికల్ గానూ సాగుతుంది అని చెప్పారు. అయితే ఈ టైమ్ లో బడ్జెట్ పరమైన సమస్యల కారణంగా ఈ మూవీ ఆగిపోయింది.
గోపీచంద్ మలినేని మూవీ ఆగిపోయిన కారణంగా అదే స్థాయిలో మరో కథ సిద్ధం చేయాలనుకున్నాడు సదరు దర్శకుడు. అనుకున్న స్థాయిలో ఈ రెండో కథను ఆల్రెడీ పూర్తి చేశాడు. ఈ కథ బాలయ్యకు కూడా బాగా నచ్చేసింది. కట్ చేస్తే ఇదే కాంబోలో మూవీ ఆగిపోతుంది అనుకున్న టైమ్ లో అదే కాంబోలో రెండో కథతో సినిమా మొదలు కాబోతోంది. మామూలుగా అయితే మరికొన్నాళ్లు చూసి బాలయ్య మరో దర్శకుడితో వేరే మూవీ స్టార్ట్ చేయాలనుకున్నాడు. బట్ గోపీచంద్ కోసం కొంత కాలం ఆగడం ఇప్పుడు చాలా పెద్ద ప్లస్ అయింది. ఈ ఇద్దరి కాంబోలో ఆల్రెడీ వచ్చిన వీర సింహారెడ్డితో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ కారణంగానే బాలయ్య వెయిట్ చేశాడు. ఇక ఇప్పుడీ ఎదురుచూపులు ఆపేసి కొత్త కథతో మళ్లీ పట్టాలెక్కబోతోంది మూవీ. హీరోయిన్ తో పాటు ఇతర టెక్నీషియన్స్ గురించి త్వరలోనే ప్రకటించబోతున్నారీ మూవీని. మొత్తంగా బాలయ్య, గోపీచంద్ మలినేని రెండో సినిమా పెద్దగా ఆలస్యం లేకుండా మొదలు పెట్టబోతున్నారన్నమాట.