నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల నటిస్తున్న చిత్రం 'షో టైమ్'. ఈ సినిమా ట్రయిలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఇది వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం, జూలై 4న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని కిషోర్ గరికిపాటి నిర్మిస్తున్నారు. మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు పాల్గొని మాట్లాడారు. చిత్ర దర్శకుడు మదన్ దక్షిణామూర్తి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన అందరికి తెలిపారు. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ సినిమా అందరికి నచ్చుతుంది. చిన్న సినిమా అయినప్పటికీ, మంచి కంటెంట్ ఉన్న సినిమా. నవీన్ చంద్ర ఒక అద్భుతమైన నటుడని అన్నారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. చాలా మంచి సినిమా చేసినప్పుడు ఆసక్తితో పాటు ఉత్సాహం, భయం కూడా ఉంటుంది. దర్శకుడు మదన్ తో పని చేయడం ఆనందంగా ఉంది. షో టైం సినిమా అందరికి నచ్చుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గవిరెడ్డి, దామోదర ప్రసాద్, పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్, రాజరవీంద్ర తదితరులు పాల్గొన్నారు.