సాలిడ్ హిట్స్ కోసం శర్వానంద్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. కొన్నాళ్లుగా పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఒకప్పుడు వైవిధ్యమైన మూవీస్ తో అదరగొట్టిన శర్వా ఎప్పుడైతే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కు వచ్చాడో అప్పటి నుంచి ఒకటీ రెండు హిట్స్ పడ్డాయి కానీ.. తర్వాత ఫ్లాపుల పరంపర మొదలైంది. అయినా అతని లైనప్ మాత్రం స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. 2017లో వచ్చిన శతమానం భవతి తర్వాత అతని ఇప్పటి వరకూ సరైన బ్లాక్ బస్టర్ పడలేదంటే ఆశ్చర్యపోతారు. చివరగా వచ్చిన మనమే కూడా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం వరుస మూవీస్ తో రెడీ అవుతున్నాడు. వీటిలో నారీ నారీ నడుమ మురారి ముందుగా విడదలవుతుంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. తర్వాత అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోందీ చిత్రంలో.
వీటితో పాటు సంపత్ నంది దర్శకత్వంలో కూడా గతంలోనే ఓ సినిమా అనౌన్స్ అయింది. ఇది తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 1960లలో సాగే కథ అని చెప్పారు. అంటే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అన్నమాట. లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నాం అని అఫీషియల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఇద్దరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ అయింది. కాబట్టి కాంబినేషన్ క్రేజ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు యాడ్ అవ్వొచ్చు. అనుపమ నటించిన పరదా మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మొత్తంగా శర్వానంద్ దూకుడుకు తగ్గ విజయాలు కూడా పడితే అతని కెరీర్ కూడా కొత్త ట్రాక్ లో ఎక్కుతుందేమో.