అనుపమ పరమేశ్వరన్.. దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. 'ప్రేమమ్'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే కట్టిపడేసింది. ఈ మూవీతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్ గా మారింది. చూడచక్కని రూపం.. అందమైన చిరునవ్వు.. ఉంగరాల ముంగురు లతో మెస్మరైజ్ చేస్తోన్న ఈ వయ్యారి.. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రంతో అడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించడం ఇప్పుడు మలయాళీ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైం ది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది అనుపమ. ఈ క్రమంలో తాజాగా ఈబ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. వైట్ డ్రెస్లో.. చక్కటి హెయిర్ స్టైల్ తో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తుంది. ఈ ఫొటోలకు 'ఒక అమ్మాయి, ఆమె 'గర్వం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫొటోలను ఫ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ చేస్తూ సంబరపడిపోతున్నారు.