Anushka Shetty : హను మాన్ హీరోతో అనుష్క పోరాటం

Update: 2024-12-16 05:30 GMT

హను మాన్ ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు తేజ సజ్జా. అంతకు ముందు అతను ఎంచుకున్న కథలు కూడా ఆకట్టుకున్నాయి. అలాంటి హీరోతో ప్యాన్ ఇండియా క్వీన్ అనుష్క బాక్సాఫీస్ వార్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం అనుష్క.. ఘాటీ అనే సినిమా చేస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదల చేసిన వీడియో గ్లింప్స్ సూపర్బ్ అనిపించుకున్నాయి. ఆంధ్రా, ఒరిస్పా బోర్డర్స్ లోని ఘాటీల నేపథ్యంలో సాగే కథ ఇదని చెప్పాడు క్రిష్.ఒక బాధితురాలు తిరుగుబాటు చేసి ఆ ప్రాంతానికి లెజెండ్ అనిపించుకున్న వైనం ఈ కథలో చూపించబోతున్నాడని ఆ గ్లింప్స్ చూస్తే అర్థం అయింది.

లేటెస్ట్ గా ఘాటీ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. ఇప్పటికైతే ఈ మూవీపై ఎలాంటి అంచనాలూ లేవు. ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి ఆ టైమ్ వరకూ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేయొచ్చు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ నే ఆల్రెడీ తేజ సజ్జా నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా మూవీ 'మిరాయ్'ను విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు.అంటే ఇప్పుడు ఘాటీ వర్సెస్ మిరాయ్ గా మారుతుందీ వార్. తెలుగులో అనుష్క క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ప్యాన్ ఇండియా స్థాయిలో బాహుబలి క్రేజ్ ను తను వాడుకోలేదు అనే చెప్పాలి. తన రీసెంట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగులో తప్ప ఇంకెక్కడా వర్కవుట్ కాలేదు. సో.. ఇది తేజ కంటే అనుష్కకే పెద్ద పరీక్ష అనుకోవాలి.

పైగా ఈ రెండు సినిమాలకు ముందు వెనక ఇంకా పెద్ద స్టార్స్ మూవీస్ ఉన్నాయి. అందుకే ఈ డేట్ లో ఏ మార్పులైనా జరగొచ్చు అనుకోవచ్చు. 

Tags:    

Similar News