Anushka Shetty : ఖైదీ 2లో అనుష్క.. నిజమెంత..?

Update: 2025-06-13 09:00 GMT

టాలీవుడ్ చాలా ఎక్కువమంది ఇష్టపడిన హీరోయిన్ అంటే అనుష్క శెట్టి అనే చెప్పాలి. తను చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఈ మధ్య కాలంలో మరో హీరోయిన్ చేయలేదు. కెరీర్ ఆరంభంలో విపరీతమైన గ్లామర్ రోల్స్ చేసినా.. అరుంధతి, పంచాక్షరి వంటి మూవీస్ తో సోలోగా సత్తా చాటింది. ఇక ప్రభాస్ తో స్నేహం తనకు మరింత మంది అభిమానులను తెచ్చింది. అతనితోనే చేసిన మిర్చి, బాహుబలి రెండు భాగాలూ తనను దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులర్ హీరోయిన్ గా మార్చాయి. బాహుబలి 2 తో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. భాగమతితో సోలోగా బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఆ తర్వాతే వెనక బడింది. పైగా అనూహ్యంగా లావు కావడంతో కొన్ని ఆఫర్స్ కూడా మిస్ అయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తను ‘తగ్గలేదు’. దీంతో సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తూ వస్తోంది. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో విజయం అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ‘ఘాటీ’అనే చిత్రంతో వస్తోంది. జూలై 11న ఘాటీ విడుదల కాబోతోంది.

ఇక తాజాగా లోకేష్ కనకరాజ్ సినీ వర్స్ లోకి స్వీటీ జాయిన్ అవుతుందీ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ సీక్వెల్ ఖైదీ 2లో అనుష్క నటించబోతోందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ వార్తల్లో ఏమంత నిజం లేదు. కాకపోతే లోకేష్ టీమ్ అనుష్కను సంప్రదించారు. ఆ మేరకు నిజం. ఇంకా తను ఓకే చెప్పలేదు. పాత్ర నచ్చితే ఓకే చేయొచ్చేమో. లోకేష్ మూవీస్ లో లేడీ రోల్స్ కు అంత పెద్ద ప్రాధాన్యం ఏం ఉండటం లేదు. ఆ మైనస్ ను అనుష్కతో ప్లస్ చేసుకోవాలంటే అనుష్క రోల్ కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. అలా ఉంటేనే తనూ ఓకే చెబుతుంది. మొత్తంగా లోకేష్ సినీ వర్స్ లోకి ఇంకా స్వీటీ ఎంటర్ కాలేదనే చెప్పాలి. 

Tags:    

Similar News