AR Rahman : నెంబర్ వన్ ప్లేస్ లో ఏఆర్ రెహమన్

Update: 2024-08-17 06:06 GMT

ఏ సినిమా పరిశ్రమకు చెందిన వారైనా.. ఎప్పటికైనా జాతీయ అవార్డ్ సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఒక్క అవార్డ్ వస్తేనే ఎంతో సంబరాలు చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం అవార్డ్ ల కోసమే పుట్టారా అన్నట్టుగా సాధిస్తుంటారు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వారిలో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. తాజాగా ప్రకటించిన 70వ జాతీయ సినిమా పురస్కారాల్లో పొన్నియన్ సెల్వన్ 1 మూవీ నేపథ్య సంగీతానికి గానూ రెహమాన్ కు నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయింది. ఈ అవార్డ్ తో కలిపి అతని ఖాతాలో మొత్తం ఏడు నేషనల్ అవార్డ్స్ చేరాయి. ఇన్ని జాతీయ అవార్డులున్న ఏకైక సంగీత దర్శకుడు రెహమానే కావడం విశేషం.

ఇప్పటికే రెహమాన్ ఖాతాలో అకాడెమీ అవార్డ్, గ్రామీ తో పాటు అనేక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులున్నాయి. అయినా స్వదేశంలో ది బెస్ట్ అనిపించుకునే అవార్డ్స్ లో నెంబర్ వన్ గా నిలవడం కూడా గర్వ కారణం కదా.

రెహమాన్ 1992లో తన ఫస్ట్ మూవీ రోజాతోనే బెస్ట్ మ్యూజిషియన్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఆ తర్వాత 1996 లో మిన్సార కనవు ( మెరుపు కలలు ), 2001లో లగాన్, 2002 లో కన్నాత్తిల్ మూత్తమిట్టన్ ( అమృత ), 2017లో కాట్రు వేలియదై ( చెలియా ) తో పాటు అదే యేడాది మామ్ అనే హిందీ చిత్రానికి ఒకేసారి రెండు భాషల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. ఇక ఈ యేడాది ప్రకటించిన అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ 1 కి నేపథ్య సంగీతం విభాగంలో అవార్డ్ అందుకుని మొత్తంగా బెస్ట్ మ్యూజీషియన్ గా ఏడు జాతీయ పురస్కారాలు సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ గా నెంబన్ ప్లేస్ లో నిలిచాడు.

ఏఆర్ రెహమాన్ తర్వాత 5 అవార్డులతో ఇళయరాజా, 4 అవార్డులతో విశాల్ భరద్వాజ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Tags:    

Similar News