Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ సత్తా చూపిస్తారా

Update: 2025-03-20 06:00 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ విడుదలవుతుందంటే ఎంత హంగామా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు కదా. కల్కి తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్. రాజాసాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. హను రాఘవపూడితో ఫౌజీ అనే మూవీ చేస్తున్నాడు. రాజా సాబ్ పూర్తయితే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన లో స్పిరిట్ ఉండబోతోంది. రాజాసాబ్ ను ఈ యేడాది సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశాలున్నాయనే టాక్ ఉంది. ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకే ఇప్పుడు సలార్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ శుక్రవారం సలార్ మళ్లీ విడుదల కాబోతోంది.

బుక్ మై షోలో సలార్ టికెట్స్ పది రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి ట్రెండింగ్ లోనే ఉందీ మూవీ. రిలీజ్ దగ్గరకు వచ్చింది. ఇక హంగామా చేయాల్సిన బాధ్యతంతా ఫ్యాన్స్ పైనే ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన ఇతర హీరోల సినిమాల రీ రిలీజ్ లతో పోలిస్తే ప్రభాస్ సినిమాలు మరీ అంత ప్రభావం చూపించలేదు. అందుకే ఈ సారి సలార్ తో సత్తా చాటాలని చూస్తున్నారు. అంటే రీ రిలీజ్ లో కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే ఇతర హీరోలతో పోటీగా కనిపించొచ్చు అనేది వారి భావన. ఆ మేరకు ఫ్యాన్స్ అన్ని చోట్లా ప్లానింగ్ తో ఉన్నారనే అంటున్నారు. మరి రెబల్ స్టార్ ఫ్యాన్స్ రిలీజ్ లప్పుడు రికార్డులు ఎవడైనా కొడతాడు.. రీ రిలీజ్ ల్లోనూ రికార్డులు కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది అనే డైలాగ్ లాగా.. బాక్సాఫీస్ వద్ద తమ దమ్ము చూపిస్తారా లేదా అనేది చూడాలి. 

Tags:    

Similar News