Akhanda 2 : అఖండ 2ను రిలీజ్ ఆపేస్తున్నారా ..?

Update: 2025-12-04 06:56 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ అఖండ2. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ మూవీ. ఇప్పటికే మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య ఓ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. తన ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీగానూ భావించిన ఈ మూవీ ప్రమోషన్స్ తోనే హోరెత్తిస్తున్నాడు. సీక్వెల్ కావడంతో పాటు మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అందుకే గంటల్లోనే విడుదల కాబోతోందీ మూవీకి సంబంధించి షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలుస్తోంది.

అఖండ 2 మూవీ రిలీజ్ ఆపేశాలని కోర్ట్ నుంచి ఒక నిర్ణయం వెలువడింది. అది కూడా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి ఆదేశించాలని కోర్ట్ ను అడగడంతో సినిమా రిలీజ్ ఆగిపోతుంది. అయితే గతంలో అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ పై ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కేస్ వేసింది. ఈ కేస్ ఆదేశానుసారంగా 14రీల్స్ బ్యానర్ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి గతంలోనే 28 కోట్లు తీసుకోవాల్సి ఉందని చెప్పింది. ఆ 28 కోట్లు ఇవ్వాల్సి వరకు మూవీ రిలీజ్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్ట్ ను ఆశ్రయించింది ఈరోస్. మరి ఆ 28 కోట్లు ఎందుకు తీసుకోవాల్సింది..? ఏ సినిమా టైమ్ లో ఈ నిర్ణయాలు జరిగాయి అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే అఖండ 2 మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అదీ కాక తమిళ్ లో మాత్రమే ఆగుతుందా లేక ఇతర భాషల్లో కూడా రిలీజ్ ఆగిపోతుందా అనేది డౌట్ గా మిగిలిపోయింది.

Tags:    

Similar News