స్పోర్ట్స్ డ్రామాల్లో ఎప్పుడైనా ఓ ఇంటెన్సిటీ ఉంటుంది. ఎమోషన్ మిక్స్ అవుతుంది. ఈ రెండిటినీ కరెక్ట్ గా బ్లెండ్ చేస్తూ మంచి కథనం రాసుకుంటే గొప్ప సినిమాలు బయటకు వస్తాయి. అలాంటిదే ఈ మూవీ అని ట్రైలర్ తోనే అనిపిస్తోన్న మూవీ ‘అర్జున్ కళ్యాణ్’. విక్రాంత్ రుద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయరామరాజు, సిజా రోస్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే సింప్లీ సూపర్బ్ అని అనకుండా ఉండలేం.
ఒకప్పుడు ఇండియా అంటే కబడ్డీకి ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు. క్రికెట్ వచ్చిన ఈ ఆటను ముంచేసింది. యూత్ క్రికెట్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయినా ఐపిఎల్ లాగా ప్రో కబడ్డీ లీగ్ వచ్చిన తర్వాత ఆ ఆటలోని మజాను ఈతరం కూడా ఆస్వాదిస్తోంది. అలాంటి ఆట నేపథ్యంలో అల్లుకున్న కథే ఈ అర్జున్ కళ్యాణ్. ఓ సాధారణ కుర్రాడు.. కబడ్డీ అనన్య సామాన్యంగా ఎదగడం.. పేరు, ప్రతిష్టలతో పాటు ఓ ప్రేమకథ కూడా అతని జీవితంలో భాగం కావడం.. అంతలోనే అన్నీ కనుమరుగైపోవడం.. ఎవరూ లేక ఏమీ లేని వాడుగా మిగిలిపోయిన ఆ వ్యక్తి తిరిగి కబడ్డీ కోర్ట్ లో ఎలా అడుగుపెట్టాడు.. ఎందుకు అనే కోణంలో సాగుతుందీ ట్రైలర్.
నిజానికి కథను ట్రైలర్ లోనే చెప్పడం కొంత రిస్క్. కథ తెలిసిన తర్వాత సినిమాపై అంత ఆసక్తి కనిపించదు. కానీ స్పోర్ట్స్ డ్రామా అంటే ఇంతే కదా. అయినా విజయం.. లేదంటే అపజయం.. అదీ లేదంటే విషాదాంతం. అందుకే ఇలాంటి మూవీస్ కు కథ తెలియడం.. కథనం తెలియకపోవడం ప్లస్ అవుతుంది. కథనంతో కట్టి పడేస్తే విజయం వరిస్తుంది. అలాంటి విజయాన్నే ఈ చిత్రం అందుబోతోంది అనేలా ఉంది ట్రైలర్. కరోనా టైమ్ లోనే పూర్తయిన ఈ చిత్రాన్ని చాలా ఆలస్యంగా ఈ నెల 29నవిడుదల చేస్తున్నారు. అందుకు కారణాలేవైనా.. వారి శ్రమకు అద్భుత విజయంతో ఫలితం దక్కేలా మాత్రం కనిపిస్తోంది.