Arjun Reddy: మళ్లీ థియేటర్లలో 'అర్జున్ రెడ్డి'.. ఈసారి స్పెషల్ ఏంటంటే..?
Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమా ఫైనల్ ఔట్‌పుట్ 4 గంటల 20 నిమిషాలు ఉందట. దానిని 3 గంటల 45 నిమిషాలకు కుదించారట.;
Arjun Reddy: టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ జెనరేషన్‌కు దగ్గరగా ఉన్న సినిమా 'అర్జున్ రెడ్డి'. అప్పటివరకు ఇంత బోల్డ్ సినిమా తెలుగులో రాలేదు.. వచ్చిన అంత భారీ స్థాయిలో విడుదల కాలేదు. ఎన్నో కాంట్రవర్సీలను తట్టుకొని మరీ.. థియేటర్లలో విడుదలయిన తర్వాత అర్జు్న్ రెడ్డి సాధించిన విజయాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే మరోసారి అర్జున్ రెడ్డి సినిమా థియేటర్లలో విడుదల కానుందని టాక్ నడుస్తోంది.
అర్జున్ రెడ్డితో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు సందీప్ రెడ్డి వంగా. అంతకు ముందు వరకు సందీప్‌కు డైరెక్షన్ అనుభవం లేదు.. కానీ అర్జున్ రెడ్డిని తనకు నచ్చినట్టుగా తెరకెక్కించాలని.. చాలా ఫైట్ చేసి హిట్ కొట్టాడు. అప్పటికీ సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్స్‌కు, డైలాగులకు అనుమతి ఇవ్వకపోయినా.. సెన్సార్ కట్ చేసిన సీన్ల కాపీని సోషల్ మీడియాలో వదిలాడు సందీప్. ఇప్పుడు ఏకంగా సినిమానే మరోసారి రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు.
అర్జున్ రెడ్డి సినిమా ఫైనల్ ఔట్‌పుట్ 4 గంటల 20 నిమిషాలు ఉందట. దానిని 3 గంటల 45 నిమిషాలకు కుదించారట. కానీ అంత నిడివి ఉంటే ప్రేక్షకులు చూడలేకపోవచ్చు అని కట్ చేశారట. అన్ని కట్స్ చేసిన తర్వాత 3 గంటల 6 నిమిషాల నిడివితో ఇది థియేటర్లలో విడుదలయ్యింది.
ఆగస్ట్ 25కి అర్జున్ రెడ్డి విడుదలయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆరోజున మరోసారి అర్జున్ రెడ్డిని థియేటర్లలో విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట సందీప్ వంగా. కానీ ఈసారి ఏ కట్స్ లేకుండా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపాడు ఈ దర్శకుడు.