అమిగోస్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. నా సామి రంగా సినిమాతో నాగార్జునతో నటించి మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ విశ్వంభర సినిమాలో ఆషికా రంగనాథ్ నటిస్తోంది. అయితే విశ్వంభరలో ఈ అమ్మడు చేయబోతున్న పాత్ర ఏంటనేది వెల్లడి కాలేదు. శాండల్ వుడ్లో ఈ బ్యూటీకి భలే క్రేజ్ఉంది. కాగా కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ సీక్వెల్ మూవీలో ఈ హాట్ బ్యూటీకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తోంది. మరో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ కన్నడ కస్తూరికి స్వాగతం చెబుతూ ఒక ఫోటో స్టిల్ ని ట్విట్టర్ లో షేర్ చేశారు.