Ashu Reddy : ఆ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా : అషూ రెడ్డి
Ashu Reddy : అరియానా గ్లోరీ, అషూ రెడ్డిలకి సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.;
Ashu Reddy : అరియానా గ్లోరీ, అషూ రెడ్డిలకి సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. అరియానా నడుముకి అషూ ముద్దుపెట్టింది. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అషూ 'అనంతమైన హావభావం' అని క్యాప్షన్ పెట్టింది. ఈ పిక్ పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఒకరు ఏంటీ చండాలము అని కామెంట్ చేస్తే.. మరొకరు ఏదో తేడాగా ఉందే అని మరొకరు మరో కామెంట్ వదిలారు.
ఇది చూసిన అరియానా.. 'ఒసేయ్ అషూ నీకు, నీ క్రేజీనెస్‌కి దండమే తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే, జడ్జిమెంటల్ అవుతున్నాం' అని ఆషూ రెడ్డికి కామెంట్ పెట్టింది. దీనికి ఆషూ రియాక్ట్ అవుతూ.. 'మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్‌ని వదిలేయకూడదు. ఎందుకంటే అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా' అని రిప్లై ఇచ్చింది.
ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక అరియానా గ్లోరీ, అషూ రెడ్డిలు ఇద్దరు తెలుగు బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యారు.