'మాయ'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అవంతిక మిశ్రా.. 'మీకు మీరే మాకు మేమే', 'వైశాఖం', 'మీకు మాత్రమే చెప్తా', 'భీష్మ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన వెబ్ సిరీస్ 'అతిథి'లోనూ మెరిసింది. ఆ తర్వాత తెలుగులో చాన్స్ లు దక్కకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్టయ్యింది. ‘ఎన్నా సొల్లా పొగిరయి, డీ బ్లాక్' మూవీల్లో మంచి నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ భామ చివరిసా రిగా బాలాజీ కేశవన్ తెరకెక్కించిన 'ఎమక్కు తొళిల్ రొమాన్స్'లో కని పించింది. మరోవైపు సినిమా చాన్స్ లు ఎలా ఉన్నా సరే అభిమానులతో మాత్రం టచ్లోనే ఉంటుంది అవంతిక .. ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అలరిస్తుం ది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త పోస్ట్ను షేర్ చేసింది ఈ వయ్యారి. వానజల్లులో అందమైన క్షణాన్ని ఆస్వా దించింది. నల్ల చీర ధరించి, దానిని సొగసైన వజ్రాల ఆభరణాలతో జత చేసింది. ఆ లుక్ ఆకర్షణ, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఫొటోలకు 'నాకు నల్ల చీర, కొన్ని వజ్రాలు చాలా ఇష్టం. ప్రతి రెండు రోజులూ వర్షం పడాలని కోరుకుంటున్నాను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ అమ్మడు షేర్చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.