Baahubali Singer Ramya : పెళ్లాడిన బాహుబలి సింగర్ రమ్య బెహరా.. పెళ్లికొడుకు ఎవరంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ యువ గాయనీ గాయకులు మూడుముళ్లతో ఒక్కటయ్యారు. సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంచి బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. కానీ ఎక్కడా కూడా ఈ వివాహానికి సంబంధించిన అప్డేట్‌ను ఆ ఇద్దరు సింగర్లు సోషల్ మీడియాలో కలిసి ఇవ్వకపోవడం విశేషం. అనురాగ్ కులకర్ణి టాలీవుడ్‌లో బిజీ సింగర్. ఆశా పాశం అంటూ అనురాగ్ అందరినీ మెప్పించాడు. ఇక ప్రేమ గీతాలకు అనురాగ్ కులకర్ణి గాత్రం అద్భుతంగా సెట్ అయింది. రమ్య బెహర మెలోడీ గీతాలను ఎక్కువగా పాడింది. బాహుబలిలో పాట పాడి ఫేమస్ అయింది. పాడుతా తీయగా నుంచి ప్రయాణం ప్రారంభించిన రమ్య.. స్వరాభిషేకంలో ఎన్నో ఎపిసోడ్స్‌లో మెలోడీ గీతాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ యువ జంటను ప్రముఖులు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.