అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ తీసిన ప్రతీ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డు క్రియోట్ చేసింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇక, ఇప్పుడు 109వ మూవీ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణలోని మాస్ యాంగిల్ ని అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి డైరెక్టర్ బాబీ సిద్ధమవుతున్నాడు. దీని గురించి ఫ్యాన్స్ కి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే, ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. " సర్కార్ సీతారాం" అనే టైటిల్ ను ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అక్టోబర్ 30న అధికారికంగా ప్రకటన ఇవ్వబోతున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం.