Balakrishna: ఓపెన్ టాప్ జీప్‌లో.. భార్య వసుంధరతో బాలకృష్ణ రైడ్..
Balakrishna: సముద్ర తీరంలో సతీమణి వసుంధరతో కలిసి జీప్ జర్నీ చేశారు బాలకృష్ణ.;
Balakrishna: సంక్రాంతి సందడంతా బాలయ్య దగ్గరే కనిపిస్తోంది. సముద్ర తీరంలో సతీమణి వసుంధరతో కలిసి జీప్ జర్నీ చేశారు బాలకృష్ణ. ఓపెన్ టాప్ ఫోర్డ్ జీప్‌లో.. సతీసమేతంగా రైడ్‌కి వెళ్లొచ్చారు బాలయ్య. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో సందడి చేశారు. భోగి పండగ రోజు సాయంత్రం నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి.. ఇలా వేటపాలెం బీచ్‌లో ఎంజాయ్ చేశారు.
ఈ సంక్రాంతిని సోదరి పురంధేశ్వరి ఇంట్లోనే ఘనంగా జరుపుకుంటున్నారు బాలకృష్ణ. కారంచేడులోని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంట్లో బాలయ్య ఫ్యామిలీ సందడి చేసింది. నిన్న గుర్రమెక్కి హల్‌చల్ చేశారు. నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి, పండగ చేసుకోవడంతో అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు.
Family Time ❤️#NandamuriBalakrishna #Balayya #NBK #NBK107 #Balakrishna pic.twitter.com/diXpZv3bNa
— ManaNandamuri (@ManaNandamuri) January 16, 2022