Balakrishna Gift : తమ్ముడికి ప్రేమతో తమన్ కు బాలయ్య కాస్ట్లీ గిఫ్ట్

Update: 2025-02-15 17:30 GMT

నటుడు నందమూరి బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కాస్ట్ లీ పోర్షే కారును గిఫ్టుగా ఇచ్చి సర్పైజ్ చేశారు. కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అం దుకోవాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని తెలియ జేస్తూ హైదరాబాద్లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన తమన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమన్ తనకు తమ్ముడితో సమా నమని, వరుసగా 4 హిట్లు ఇచ్చినందుకు ప్రేమతో కారును బహుమతిగా ఇచ్చానని చెప్పారు. భవిష్యత్తులోనూ తన జర్నీ ఇలాగే కొనసాగుతోందని తెలిపారు. కారు విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. వీరిద్దరి కాంబోలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు వచ్చాయి. బాలయ్య నటిస్తోన్న సరికొత్త మూవీ 'అఖండ 2' కు కూడా తమన్ స్వరాలు అందిస్తోన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News