Akhanda 2 : అఖండ 2 .. బాలయ్య పని ఐపోయింది

Update: 2025-08-08 08:21 GMT

నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవెయిటెడ్ మూవీ అఖండ 2 తాండవం. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన అఖండకు సీక్వెల్ గా వస్తుండటం.. బోయపాటి శ్రీను డైరెక్టర్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 25 రిలీజ్ టార్గెట్ గా చిత్రీకరణ జరుపుకుంటోందీ మూవీ. ఫస్ట్ పార్ట్ కు తమన్ నేపథ్య సంగీతం, డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. ఈ సారి కూడా అవే హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. అలాగే హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో పాటు ఈ పార్ట్ లో సంయుక్త కూడా యాడ్ అయింది. భజరంగీ భాయీజాన్ ఫేమ్ బేబీ హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు టీనేజ్ లోకి ఎంటర్ అయింది. తను అఖండ 2తో జననిగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న టైమ్ సడెన్ గా కార్మికుల సమ్మె వల్ల సినిమాకు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే బాలయ్యకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయిందట. అందుకే ఈ గ్యాప్ లో సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేశారు. తాజాగా అఖండ2 కు సంబంధించి తన పార్ట్ మొత్తానికి డబ్బింగ్ పూర్తి చేశారని చెబుతూ ఓ స్టిల్ విడుదల చేశారు. సో.. మహా అయితే పాటలు బ్యాలన్స్ ఉండి ఉంటాయి.అందువల్ల సినిమా గ్యారెంటీగా సెప్టెంబర్ 25కు రావొచ్చు. లేదంటే డిసెంబర్ 18 అనుకున్నారు.

 

Tags:    

Similar News