Daku Maharaj : పిల్లాడిలా మారిన డాకూ మహరాజ్

Update: 2024-12-24 04:54 GMT

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకూ మహరాజ్. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ ను బట్టి ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోందంటున్నారు. పైగా సంక్రాంతి అంటే బాలయ్యకు బాగా కలిసొచ్చిన సీజన్.ఆ సెంటిమెంట్ కూడా యాడ్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం నుంచి ఆ మధ్య వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు.

ఓ చిన్న పాపతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నట్టుగా ఉందీ సాంగ్. "చిన్ని చిన్ని నేనేలే నీకన్నీ.. కన్నీ కన్నీ నీ వేషాలింకెన్ని.. అవి మురిపిస్తాయే నా లోకాన్ని" అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాయగా, విశాల్ మిశ్రా పాడాడు.కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా అనిపించేలా ఉందీ సాంగ్ చూస్తుంటే.ఇందులో బాలయ్య పరివారం మొత్తం కనిపిస్తోంది. ఆ పరివారాన్ని కోల్పోయాక డాకూ మహరాజ్ అవుతాడా లేక డాకూ మహరాజ్ ఫ్యామిలీ కోసం ఇలా మారాడా అనే కోణంలో ఉంటుందేమో కథ అనిపిస్తోంది.

ఫస్ట్ సాంగ్ ఎలా ఉన్నా.. ఈ పాటతో థమన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్నాడు అనే చెప్పాలి. ఈ తరహా పాటే ఇంతకు ముందు బాలయ్య నటించిన భగవంత్ కేసరిలో కూడా కనిపించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కలర్ తో కనిపిస్తోంది. మరి రాబోయే పాటలు ఎలా ఉంటాయో కానీ ఈ మూవీలో బాలయ్యతో పాటు ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Tags:    

Similar News