Basil Joseph : ఓటిటిలోకి బాసిల్ జోసెఫ్ డార్క్ కామెడీ మూవీ మరణ మాస్

Update: 2025-05-12 13:23 GMT

డార్క్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘మరణ మాస్’ సినిమా థియేట‌ర్స్‌లో ఆడియెన్స్‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఓటీటీలో మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. మే15 నుంచి ఈ చిత్రం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. బాసిల్ జోసెఫ్‌, రాజేష్ మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి శివ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ్యంగ్యం, స‌స్పెన్స్, అసంబ‌ద్ధ‌త వంటి అంశాల క‌ల‌యిక‌తోఅద్భుత‌మైన రోల‌ర్‌కోస్ట‌ర్ సినిమా తెర‌కెక్కింది.

వాస్తవం అస్పష్టంగా మారినప్పుడు, ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది: ప్రతిదీ నిజమేనా, లేక ఎవరో విష‌యాన్ని పెద్ద‌దిగా చేయాల‌ని చూస్తున్నారా? అని. ‘మరణ మాస్’ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే ఒక హత్యను చూసినట్లు భావించే ఇద్దరు స్నేహితుల చుట్టూ కేరళలోని నేపథ్యంలో సాగుతుందీ చిత్రం. ఆ తర్వాత స్థానిక రాజకీయాలు, దాగిన ఎజెండాలు, ఎవ‌రూ ఊహించ‌కుండా జ‌రిగే సంఘటనలు అనూహ్యంగా వెలుగులోకి వస్తాయి.

ఈ సంద‌ర్భంగా బాసిల్ జోసెఫ్ మాట్లాడుతూ ‘‘మరణ మాస్ సినిమా నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. వైవిధ్య‌మైన‌ హాస్యం, పాత్రలు, అనూహ్యమైన ట్విస్ట్‌లు దీన్ని ఒక అద్భుతమైన అనుభవంగా మారుస్తాయి. ఇది వ‌ర‌కు సోనీ లివ్‌లో నేను న‌టించిన ప్ర‌వీణ్‌కూడు ష‌ప్పు సినిమాకు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. త‌ర్వాత ఇప్పుడు ఇదే ఓటీటీలో మ‌రోసారి మ‌రో వైవిధ్య‌మైన సినిమాతో ముందుకు రావ‌టం అనేది ఎంతో ఆనందంగా ఉంది. సినిమాను చూసే ఆడియెన్స్ త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తార‌ని నేను న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను’’ అన్నారు.

Tags:    

Similar News