Anupama : అందాల అనుపమ.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

Update: 2025-06-04 06:30 GMT

'ప్రేమమ్' మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్..ఉంగరాల జుట్టుతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అతర్వాత అఆ, శతమానం భవతి, నట సార్వభౌమ, ఉన్నది ఒక్కటే జిందగీ, అంటే సుందరానికి, కార్తి కేయ 2, 18 పేజెస్, టిల్లు స్క్వేర్ వంటి సినిమాల్లో చాన్స్ కొట్టేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన నటన, అందం, గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచేసింది. ఇటీవలే విడుద లైన డ్రాగన్లోనూ మెస్మరైజ్ చేసింది. తాజాగా ఈబ్యూటీ నటించిన 'జానకి వర్సెస్ట్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ ఈనెల 20న రిలీజ్ కానుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు, మలయాళ, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తోంది అనుపమ. అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్లో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగాౌ సంప్రదాయ పట్టుచీరలో కనిపించి అందాలతో ఆకట్టుకుంది. ఒంటి నిండా నగలు.. చీరలో మోడ్రన్ లుక్.. డిఫరెంట్ స్టైల్లో ఉన్న పిక్స్ ఇన్స్టాలో షేర్చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అనుపమ అందం చూసి నీ మేని ఛాయకు బంగారం కూడా వెలవెలబోతోంది సఖి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News