బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 12వ చిత్రం గురించి వివరాలు ప్రకటించారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ 75వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ తాజా చిత్రాన్ని వెల్లడించారు. నటుడిగా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న బెల్లంకొండ నటిస్తున్న 12వ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
ఈ చిత్రం ద్వారా లుధీర్ బైరెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్నారు. 400 ఏళ్ల నాటి గుడి నేపథ్యంలో థ్రిల్లర్ సినిమాగా రూపొందుతుందని చిత్ర బృందం తెలిపింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త అవతార్ లో కనిపిస్తాడు. ప్రకటన పోస్టర్ లో హీరో పురాతన ఆలయం ముందు నిలబడి ఉన్నాడు. చేతిలో తుపాకి కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. తదుపరి షెడ్యూల్ బుధవారం నుండి జరగనుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం శేవేంద్ర, సంగీతం లియోన్ జేమ్స్.