మోడలింగ్ కెరీర్ ఎంచుకొన్న భామ భాగ్యశ్రీ బోర్సే. ఓ ఏజెన్సీతో కలిసి పనిచేసి పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్ బరీ డైరీ మిల్క్ యాప్ తో ప్రసిద్ది చెందింది. యారియాన్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందులో రాజ్యల క్ష్మీ పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత చందు చాంపియన్లోనూ నటించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా అమ్మడికి వరుస ఛాన్స్ లు వస్తున్నా యి. ప్రస్తుతం తెలుగులో ఇద్దరు స్టార్స్ తో నటిస్తుంది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న సినిమా ఒకటి కాగా, రెండోది రామ్తో చేస్తున్న సినిమా. అయితే రామ్ తో చేసే సినిమా లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఆ సినిమాలో వీరిద్దరి జోడీ అదిరిపోతుందట. మరోపక్క విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాలో అమ్మడు లిప్ లాక్స్ కూడా చేసిందని తెలుస్తుంది. లేటెస్ట్ గా లిప్ లాక్ చేసిన సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ ప్రోమో చూసిన ఆడియ న్స్ భాగ్య శ్రీ ఇలా లిప్ లాక్స్ తో కూడా రెచ్చిపోతే మాత్రం ఇక అమ్మడికి టాలీవుడ్ లో టాప్ చెయిర్ ఇచ్చేయడం గ్యారెంటీ అంటున్నారు.