బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన సినిమా భైరవం. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్ లో రూపొందిన గరుడన్ కు రీమేక్. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై ఫీమేల్ లీడ్ లో నటించారు. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ముగ్గురు స్నేహితుల మధ్య సాగే కథ. కాకపోతే ఇందులో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు కూడా ఉంటాయి. స్నేహంలో మరో కోణాన్ని చూపించే సినిమాగా తమిళ్ లో ప్రశంసలు అందుకుంది. మరి తెలుగులోనూ అదే చేస్తున్నారా లేక ఏవైనా మర్పులు చేర్పులు చేశారా అనేది అప్పుడే చెప్పలే కానీ.. చాలా రోజుల తర్వాత ఒక స్థాయి ఉన్న హీరోలు ముగ్గురు కలిసి నటిస్తోన్న సినిమాగా భైరవం అట్రాక్ట్ చేస్తోంది.
ఇక ఇప్పటి వచ్చిన రెండు పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ఈ నెల 30న విడుదల కాబోతోన్న భైరవం ట్రైలర్ ను ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏలూరులో చేయబోతుండటం విశేషం. ఏలూరులోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్ లో ఈవెంట్ జరగబోతోంది. ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన పోస్టర్ లో కేవలం శ్రీనివాస్ ఫోటో మాత్రమే వాడారు. అంటే సినిమాలో ఓ రకంగా అతనిదే మెయిన్ లీడ్ అనుకోవచ్చు.