తమిళంలో సూరి, శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం 'గరుడన్'. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తో విజయ్ కనకమేడల భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ నటీనటులకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. వారి పాత్రలు రివీల్ చేస్తున్న ఫస్ట్ లుక్లలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సాయి శ్రీనివాస్, అతిధి శంకర్, నారా రోహిత్, మంచు మనోజ్, ఆనంది పాత్రలు విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇవాళ నటి ఆనంది పుట్టిన రోజు కావడంతో మరో లుక్ ను విడుదల చేశారు. తెలుగింటి అందం 'నీలిమ'గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆనంది అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించింది.