Bhavadeeyudu Bhagat Singh : లెక్చరర్ గా పవర్ స్టార్.. ఆగస్టులో సెట్స్ పైకి..!
Bhavadeeyudu Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;
Bhavadeeyudu Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా ఫస్ట్ టైం నటించనుంది. సందేశంతో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న పవన్.. హరీష్ సినిమాకి కూడా డేట్స్ కేటాయించినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని కొత్తగా చూపించబోతున్నాడట హరీష్.. ఇందులో పవన్ లెక్చరర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. పవన్ గెటప్, అతడి కాస్ట్యూమ్స్ హైలెట్ గా నిలుస్తాయని, డైలాగ్స్ ఓ దశాబ్దం పాటు చెప్పుకుంటారని ఇటీవల వెల్లడించాడు హరీష్..
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత పవన్, హరీష్ కాంబోలో సినిమా వస్తుండడంతో భవదీయుడు భగత్ సింగ్ మూవీ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.