Bheemla Nayak Trailer : సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న భీమ్లానాయక్ ట్రైలర్... కొన్ని గంటల్లోనే
Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్ మెయిన్ లీడ్ లో వస్తోన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్.;
Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్ మెయిన్ లీడ్ లో వస్తోన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మూవీ ట్రైలర్ ని నిన్న(సోమవారం) రాత్రి తొమ్మిది గంటలకి రిలీజ్ చేశారు మేకర్స్.. ట్రైలర్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసింది.
పవన్ కల్యాణ్, రానా మధ్య సాగే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి . తమన్ మ్యూజిక్‌తోపాటు పవన్ కల్యాణ్, రానా యాక్టింగ్ సూపర్బ్ అనిపించాయి. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ ట్రైలర్. టాలీవుడ్ అత్యదిక వేగంగా 100K లైక్స్ అందుకున్న ట్రైలర్ గా రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు 793 K లైక్స్‌తో దూకుడు మీదుంది. ఇక అత్యంత వేగంగా 7 మిలియన్ వ్యూస్‌ను అందుకొని రికార్డు సృష్టించింది.
ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకు పుష్ప సినిమా 19గంటల 19 నిమిషాల్లో 800K లైక్స్ అందుకోగా, పవన్ వకీల్ సాబ్ 13 గంటల్లో ఆ రికార్డు అందుకుంది. ఇక RRR సినిమా 4 గంటల 12 నిమిషాల్లో ఆ రికార్డును అందుకోగా భీమ్లా నాయక్ మాత్రం కేవలం 1 గంట 56 నిమిషాల్లోనే అత్యధిక లైక్స్ అందుకున్న ట్రైలర్ గా రీకార్డును బ్రేక్ చేసింది.
కాగా ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
POWER STORM ALERT 🚨 🌪#BheemlaNayakTrailer Hits Fastest Ever 𝟕 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Views!🔥
— BA Raju's Team (@baraju_SuperHit) February 21, 2022
➡️https://t.co/hBcH80zYVi#BheemlaNayakOn25thFeb ✨#BheemlaNayak @PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @vamsi84 @NavinNooli pic.twitter.com/de9BxgAm8Q