అంతా అనుకున్నదే జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత రూత్ ప్రభు.. రెండో సారి పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమెవివాహమాడింది. ఈషా యోగా సెంటర్‌లో వీరి పెళ్లి జగింది. పెళ్లిలో సమంత ఎర్రచీర కట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ సోషల్‌మీడియా వేదికగా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమంత పలుమార్లు రాజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ ఏడడుగులు వేశారు.