Dhurandhar 2 : ధురంధర్ 2 రిలీజ్ పైనా డౌటేనా..?

Update: 2026-03-04 12:02 GMT

టాక్సిక్ వాయిదా పడింది. ఈ మూవీపై పెద్దగా అంచనాలు కూడా లేవు కాబట్టి పోస్ట్ పోన్ పై పెద్దగా ప్రభావం పడదు అనుకున్నారు. బట్ ధురంధర్ 2 పై భారీ అంచనాలున్నాయి. ఇది ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అనుకుంటున్నారు. ఆల్రెడీ గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడు కేవలం హిందీలోనే సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి మూవీకి సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయిక. మార్చి 19న ఈ మూవీ విడుదల కాబోతోంది అని చెప్పారు. కానీ మూవీ విడుదల విషయంలో టీమ్ పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవడం లేదు. టీజర్ ఓకే అనిపించుకుంది. బట్ ఈ సారి ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ట్రైలర్ కాస్త ముందుగా విడుదల చేస్తే ప్రమోషన్స్ కూడా ఆ స్థాయిలో ఉంటాయి అని భావించారు. బట్ ఈ విషయంలో మూవీ టీమ్ పెద్దగా ఎగ్జైట్ కావడం లేదు.

ధురంధర్2 ట్రైలర్ ఈ నెల 6న విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ఆ మేరకు ఎలాంటి హడావిడీ కనిపించడం లేదు. అసలు ట్రైలర్ వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ ఈ మూవీ టైమ్ కు ట్రైలర్ విడుదల చేయడం లేదు అంటే ఇన్ డైరెక్ట్ గా మూవీ కూడా వాయిదా పడినట్టే అని చెబుతున్నారు. అదేంటో తెలియదు కానీ ఈ మూవీ విడుదల విషయంలో ముందు నుంచీ వీళ్లు పెద్దగా హడావిడీ చేయడం లేదు. ఆ కారణంగానే ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఈ మూవీ చెప్పిన టైమ్ కు విడుదలవుతుందా లేక వాయిదా పడుతుందా అనేది చాలా తక్కువ టైమ్ లోనే తెలిసిపోతుంది. 

Tags:    

Similar News