Big Shock For Monalisa : మోనాలిసాకు బిగ్ షాక్.. నిర్మాత సంచలన కామెంట్స్

Update: 2025-02-20 06:15 GMT

కుంభమేళాలో వైరలయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు’ అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు. ఆయన స్పందిస్తూ.. మోనాలిసా నా కూతురు లాంటిది. నేను ఆమెను వేధించడం లేదు. మోనాలిసా ఇష్టపూర్వకంగానే నటనపై ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను. ఆమె ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేనే యాక్టింగ్ నేర్పిస్తున్నాను. ఇది తప్పుదోవ పట్టించడం కాదని స్పష్టం చేశారు. ట్రైనింగ్ పూర్తవ్వగానే సినిమాలో అవకాశం ఇస్తానని సనోజ్ మిశ్రా వెల్లడించారు. ప్రేమకథ, స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఏప్రిల్ నుంచి మోనాలిసా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News