డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా రాజా సాబ్. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేస్తున్నాం అని తెగ ఊరించారు మేకర్స్. ఊరించినట్టుగానే మాంచి గ్లింప్స్ వచ్చింది. 45 సెకన్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ లో ప్రభాస్ బైక్ పై నుంచి వచ్చి ఓ కార్ దగ్గర పార్క్ చేస్తాడు. ఆ కార్ మిర్రర్ లో తనను తాను చూసుకుని కొన్ని పూలు తీసుకుని తనకు తానే దిష్టి తీసుకుంటున్నట్టుగా ఉన్న వీడియో బావుంది. ఖచ్చితంగా ఈ లుక్ లో మేకర్స్ చెప్పినట్టుగా వింటేజ్ ప్రభాస్ కనిపించాడనే చెప్పాలి.
గ్లింప్స్ తో పాటు ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ అండ్ డిజప్పాయింటింగ్ న్యూస్ కూడా వచ్చింది. రాజాసాబ్ ఈ యేడాదే విడుదలవుతుందని చాలామంది భావించారు. లేదంటే సంక్రాంతికైనా వస్తుందనుకున్నారు. ఈ రెండూ కాదని ఏకంగా 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. అభిమానులకు ఇది కొంత డిజప్పాయింట్ చేసే న్యూస్ అనే చెప్పాలి. అలాగే ఓ సాలిడ్ అప్డేట్ వచ్చిందని హ్యాపీగానూ ఫీలవుతారేమో.
మొత్తంగా తెలుగులో హారర్ కామెడీ అనే ట్రెండ్ ను క్రియేట్ చేసిన మారుతి స్టైల్లోనే ఈ మూవీ కూడా హారర్ రొమాంటిక్ కామెడీగా ఉండబోతోందని చెప్పారు.సో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఇక నెక్ట్స్ ఇయర్ సమ్మర్ వరకూ వెయిట్ చేయాల్సిందే అన్నమాట.