తెలుగునాట బిగ్ బాస్ తన ప్రేక్షకులను మోసం చేస్తోంది. ప్రేక్షకులు ఓటు వేసిన వాళ్లే గెలుస్తున్నారని ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ అదంతా నిజం కాదు. అసలు ఓటింగ్ వేరే ఉంటే.. బిగ్ బాస్ తనకు కావాల్సిన వారినే విన్నర్లను చేస్తున్నాడు. గత మూడు సీజన్ల నుంచి ఇదే జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారిలో తనకు కావాల్సిన వారినే టాప్-5 దాకా తీసుకెళ్తాడు. తాను ఎవరిని విన్నర్ చేయాలని అనుకుంటున్నాడో వారినే విన్నర్ చేసేస్తాడు. పాపం ప్రేక్షకులకు ఇదంతా తెలియక.. రియాల్టీ షో కదా తాము ఓట్లు వేసిన వాళ్లే గెలుస్తున్నారని భావిస్తున్నారు. కానీ ఇక్కడే బిగ్ బాస్ ఆడుతున్న మైండ్ గేమ్ వేరే ఉంది. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వారిలో స్టార్ మా, హాట్ స్టార్ సీరియళ్లు, షోలలో నటించే వారికే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది హౌస్ లో.
వాళ్లను చాలా మంచి వాళ్లుగా చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ తర్వాత కూడా ఆ నటీనటులు తమ ఛానెళ్లలో పనిచేయాలి కాబట్టి.. వారిని మంచి వారిగా చూపించి వారినే ఎక్కువగా టాప్-5 దాకా తీసుకెళ్తుంటారు. గత సీజన్ లో నిఖిల్ ను విన్నర్ చేయడానికి కారణం కూడా అదే. అతను తెలుగువ్యక్తి కాదు. కర్ణాటకకు చెందిన వాడు. వాస్తవానికి గౌతమ్ కు ఎక్కువ ఓటింగ్ వచ్చినా సరే నిఖిల్ నే విన్నర్ ను చేశారనేది పెద్ద ఆరోపణ. వేరే ఛానెళ్లలోని కామెడీ షోలు, ఇతర సీరియళ్లలో నటించే వారిని కావాల్సినంత నెగెటివ్ గా చూపిస్తుంటాడు. అలా చూపిస్తే ఆ ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్ పడిపోతుంది కదా. అందుకే బిగ్ బాస్ ఈ ఎత్తుగడ వేస్తుంటాడు.
ప్రేక్షకులు వేసే ఓట్లను కూడా బిగ్ బాస్ తారు మారు చేసేస్తుంటాడు. ప్రతి ఆదివారం నాగార్జున వచ్చి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తుంటాడు. కానీ ఎలిమినేట్ చేసే టైమ్ లో ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఎప్పుడైనా చూపించారా.. డిస్ ప్లే చేశారా అంటే లేదు. మరి ఎందుకు చేయరు. రియాల్టీ షోనే కదా. ఇందులో అన్నీ రియల్ గా చూపించాలి కదా. కానీ ఎందుకు చూపించరు. పోనీ విన్నర్ ను అనౌన్స్ చేసిన తర్వాత అయినా ఎవరికి ఎన్ని లక్షల ఓట్లు వచ్చాయనేది చూపిస్తారా అంటే అదీ లేదు. వాళ్లు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వారిని డైరెక్ట్ గా చేసేస్తారు. అంటే ప్రేక్షకులు వేసిన ఓట్లకు కనీసం విలువ లేదు. ఇక హౌస్ లో బిగ్ బాస్ తనకు నచ్చిన వారిని చాలా మంచిగా చూపిస్తాడు. వాళ్లు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని గొడవలు చేసినా సరే అవన్నీ ఎడిటింగ్ లో తీసేసి వాళ్లు చేసిన మంచి పనులను మాత్రమే చూపిస్తాడు. తనకు నచ్చని వారు ఎంత మంచి పనులు చేస్తున్నా వాటిని డిలీట్ చేసి.. వారు చేసే చిన్న మిస్టేక్స్ ను చూపిస్తూ వారిని ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్ గా చూపించేస్తాడు. దాంతో ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ మంచిగా చూపించే వారికే ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఇలా తనకు కావాల్సిన వారిని విన్నర్ లను చేస్తూ.. బిగ్ బాస్ ఫేక్ గేమ్ ఆడుతున్నాడు.