Bigg Boss: నామినేషన్ ప్రక్రియ షురూ.. యాంకర్ రవికి టెండర్..
అప్పుడే ఎవరు ఎవరికి అర్థం అయ్యారో తెలియదు కానీ ఎక్కువ మంది యాంకర్ రవిని టార్గెట్ చేశారు..;
Bigg Boss: ఆదివారం ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారు పంతొమ్మిది కంటెస్టెంట్లు.. అప్పుడే ఎవరు ఎవరికి అర్థం అయ్యారో తెలియదు.. ఎక్కువ మంది యాంకర్ రవిని టార్గెట్ చేశారు.. సోమవారం నామినేషన్ ప్ర్రక్రియ ఉండడంతో హౌస్‌లో ఉన్న 19 మంది ఫోటోలను బ్లాక్ కవర్లో పెట్టారు.. నామినేషన్ చేయాలనుకున్న వారి కవర్‌ని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేయడంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.
దీంతో ఒకర్ని ఒకరు దూషించుకుంటూ నామినేషన్ చేయడం మొదలు పెట్టారు. యూట్యూబర్ లోబో యాంకర్ రవిని టార్గెట్ చేశాడు.. నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అని అతడిని నామినేట్ చేశాడు. ఆ తరువాత సరయూ కాజల్‌ని నామినేట్ చేసింది. ఇక రవి.. నటరాజ్ మాస్టర్‌ని నామినేట్ చేస్తూ మీరు చాలా స్ట్రిక్ట్‌గా అనిపిస్తున్నారు అని అనడంతో.. నేను ఇలాగే ఉంటా నటించడం రాదు అని రవికి కౌంటర్ ఇచ్చాడు. సో.. అప్పుడే ఆట మొదలైందన్నమాట. బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు.