Bigg Boss 5 Telugu : రెండోవారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీళ్ళే..!
Bigg Boss 5 Telugu: అక్కినేని నాగర్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ ఫైవ్ మొదటివారన్ని సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టింది.;
Bigg Boss 5 Telugu: అక్కినేని నాగర్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ ఫైవ్ మొదటివారన్ని సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ సోమవారం జరిగింది. మొత్తం 18మంది ఇంటిసభ్యులున్న హౌజ్‌లో ఉండగా వీరిని ఊల్ఫ్, ఈగల్ టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్ సూచించాడు. ఊల్ఫ్‌లో మానస్, సన్నీ విజయ్, కాజల్, శ్వేత వర్మ, లహరి, రవి, నటరాజ్, జస్వంత్, ఉమాదేవి లుండగా, ఈగల్‌లో లోబో, శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంక, ప్రియ, అనీ మాస్టర్, హమీదా, విశ్వ, షణ్ముకలు ఉన్నారు.
అయితే ఇందులో ఎదుటి టీమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్లు హౌస్‌లో ఉంటానికి ఎందుకు అర్హులు కారో సరైన కారణాలు చెబుతూ, వాళ్ల ముఖానికి ఎరుపు రంగు పూయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఊల్ఫ్ టీమ్ నుంచి ఉమాదేవి, నటరాజ్, కాజల్ నామినేట్ కాగా.. ఈగల్ టీమ్ నుంచి లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌లు నామినేట్ అయ్యారు. దీనితో రెండోవారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా బిగ్‌బాస్ సీజన్ ఫైవ్‌లో మొదటివారం ఎలిమినేషన్‌లో భాగంగా సరయూ వెళ్ళిన సంగతి తెలిసిందే.