Biggboss 4 Telugu Final : గ్రాండ్ ఫినాలే ప్రోమో .. గెస్ట్ ఎవరంటే?
15 వారల పాటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు(ఆదివారం) బిగ్ బాస్ ఫైనల్ విజేతను ప్రకటించనున్నారు.;
15 వారల పాటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు(ఆదివారం) బిగ్ బాస్ ఫైనల్ విజేతను ప్రకటించనున్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్ లలో ఎవరు విజేత అవుతారన్నది ఎంత ఆసక్తిగా ఉందొ, గెస్ట్ ఎవరన్నది కూడా అంతే ఆసక్తిగా ఉంది. అయితే అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేందుకు కొద్దిసేపటి క్రితమే ప్రోమోను వదిలారు బిగ్‌బాస్ నిర్వాహకులు.
ఈ ప్రోమోలో ఖతర్నాక్ పాటతో నాగార్జున స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్ దివి, మోనాల్, మెహబూబ్, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, అవినాష్, సుజాత హౌస్ లోకి స్పెషల్ సాంగ్స్ తో ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. వీరితో పాటుగా హీరోయిన్స్ ప్రణీత, మెహరీన్ కూడా స్పెషల్ సాంగ్స్ తో అదరగొట్టారు. అటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌ని ఇమిటేట్ చేస్తూ సందడి చేశారు.
ఇక చివర్లో తమన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. కానీ గెస్ట్ ఎవరు అన్నది మాత్రం ఎక్కడ కూడా రివీల్ చేయలేదు.