Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ మా అమ్మాయిని.. ఏం బాలేదు..: సిరి తల్లి షాకింగ్ కామెంట్స్
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో కుటుంబసభ్యుల ఎంట్రీతో సందడి వాతావరణం నెలకొంది.;
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో కుటుంబసభ్యుల ఎంట్రీతో సందడి వాతావరణం నెలకొంది. కంటెస్టెంట్లలో భావోద్వేగం, ఆనందం కట్టలు తెచ్చుకుంది. కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. చాలా రోజుల తర్వాత కుటుంబసభ్యులు కలవడంతో అందరిలో ఆనందం నెలకొంది. ఇక నేటి ఎపిసోడ్‌లో మానస్ తల్లితో పాటు, సిరి తల్లి కూడా హౌస్‌లోకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తాజాగా విడుదలైన ప్రోమో చూపిస్తోంది.
అమ్మను చూసి ఆనందంతో ఎగిరి గంతేసాడు మానస్.. హౌస్‌లో కంటెస్టెంట్లందరినీ ఓ ఆట ఆడుకుంది. కాజల్ చాయ్ ఇవ్వబోతే.. నీకు వంట రాదుగా అని పంచ్ వేసింది. శ్రీరామ్ ఆంటీ అని పిలవడంతో.. ఆంటీ అంటున్నావేంటి.. నేను నీ గర్ల్ ఫ్రెండ్‌ని అని అనడంతో ఇంటి సభ్యులు పడీపడీ నవ్వుకున్నారు.
సిరి తల్లి కూడా హౌస్‌లోకి రావడంతో అమ్మని ముద్దులతో ముంచెత్తింది. చాలా రోజుల తరువాత తల్లిని చూసిన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది. షణ్ముఖ్‌తో నీ వ్యవహారం నచ్చలేదని కూతురిని స్మూత్‌గా మందలించింది. అయిన దానికి, కాని దానికి షణ్ముఖ్.. సిరికి హెల్ప్ చేయడం నచ్చడం లేదని చెప్పింది.
షోని అందరూ చూస్తుంటారని తెలిసి కూడా ఎమోషన్ అవుతుంటారు.. ఒకరికొకరు కనెక్ట్ అవుతుంటారు. బయటకు వచ్చాక మామధ్య ఏం లేదని చెప్పడం మామూలే. మరి సిరి, షణ్ముఖ్.. సీరియస్‌గా తీసుకుంటారో లేదో ఆమె అన్న మాటల్ని.
కథలన్నీ కంచికి చేరినట్లు.. బిగ్‌బాస్ హౌస్‌లోని లవ్ స్టోరీలన్నీ అక్కడ వరకే పరిమితమవుతుంటాయి.. చాలా రేర్‌గా పెళ్లికి దారి తీస్తాయి.. అది కూడా దక్షిణాదికి చెందిన బిగ్‌బాస్ షోల్లో మాత్రమే జరగడాన్ని ఇప్పటి వరకు మనం చూశాం. అయితే మన తెలుగు కంటెస్టెంట్లు మాత్రం బయటకు వచ్చాక నువ్వెవరో, నేనెవరో అన్నట్లు ఉంటారు.. ఎవరి జీవితాల్లో వాళ్లు హ్యాపీగా ఉంటారు.