భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘భైరవం’ సినిమాతో అలరించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘భైరవం’ మే 30న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ త్రయం చేసిన పర్ఫామెన్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
ప్రస్తుతం ‘భైరవం’ మూవీ జూలై 18న ఈ చిత్రం జీ5లోకి రాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో ‘భైరవం’ మూవీ జీ5లో ఆడియెన్స్‌కి అందుబాటులో ఉండనుంది. థియేటర్లో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రానుంది.
వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద రాజకీయ నాయకుడు కన్నువేయడం, ఆ భూమిని కాపాడేందుకు ధర్మకర్త ముగ్గురు హీరోల చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ ముగ్గురు హీరోల పాత్రలు చివరకు ఎలా ముగుస్తాయి? ఈ క్రమంలో ఎవరెవరు ఏ దారిని ఎంచుకుంటారు? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు. జూలై 18 నుంచి ‘భైరవం’ చిత్రాన్ని జీ5లో స్ట్రీమ్ కాబోతోంది.