Kangana Ranaut: తిరుమల శ్రీవారి సేవలో కంగన.. మంచు విష్ణుకి థాంక్స్..!

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.;

Update: 2022-05-16 05:48 GMT

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా సినీ నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను మంచు విష్ణు దగ్గరుండి చూసుకున్నారని తెలుస్తోంది. కాగా కంగనా నటించిన 'ధాకడ్‌' చిత్రం మే 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీ ప్రమోషన్ లో బిజీబిజీగా గడుపుతున్న కంగన.. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కంగనాతో పాటు చిత్ర యూనిట్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధాకడ్ సినిమా మంచి సక్సెస్ కావాలని స్వామి వారిని కోరుకున్నట్లుగా వెల్లడించింది.

Similar News