Bollywood : రెమ్యునరేషన్ విషయంలో సల్మాన్‌ను మించిన అమితాబ్

Update: 2025-07-19 10:30 GMT

'కౌన్ బనేగా కరోడ్ పతి' షో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. 'కౌన్ బనేగా కరోడ్ పతి' 17వ సీజన్ ఆగస్టు 11 నుండి ప్రారంభం కానుంది. ఈ షో యొక్క కొత్త ప్రోమో ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంటోంది. దీనికి అమితాబ్ బచ్చన్ అందుకునే పారితోషికం గురించి చర్చ జరుగుతోంది.

ఈ సంవత్సరం కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. మూడవ సీజన్ మినహా, అతను షో యొక్క మిగిలిన అన్ని సీజన్లకు హోస్ట్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో బిగ్ బి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 'కేబీసీ 17' షోలో ఒక్కో ఎపిసోడ్‌కు అమితాబ్ బచ్చన్ రూ.5 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షో వారానికి ఐదు రోజులు ప్రసారం అవుతుంది.. కాబట్టి వారానికి రూ. 25 కోట్లు అందుకుంటాడు. అంటే టెలివిజన్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న వ్యాఖ్యాతగా నిలిచాడు.

రెమ్యునరేషన్ విషయంలో అమితాబ్ సల్మాన్ ఖాన్‌ను అధిగమించారు. 'బిగ్ బాస్' హోస్ట్ గా సల్మాన్ ఎపిసోడ్ కి 12 కోట్లు తీసుకుంటాడు. వారానికి రెండు ఎపిసోడ్లు మాత్రమే చేయడం ద్వారా అతని సంపాదన 24 కోట్ల రూపాయలు. కానీ అమితాబ్ అంతకంటే ఎక్కువే సంపాదిస్తాడు. KBC 17 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. పోటీదారులు Sony Liv యాప్, SMS లేదా IVR కాల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. సల్మాన్ ఖాన్ త్వరలో బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్నారు. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News