‘జాట్’తో మంచి హిట్ అందుకు న్న బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ నటి స్తున్న మరో అవైటెడ్ చిత్రమే 'బోర్డర్ 2'. తన కెరీర్లో భారీ హిట్ అయ్యిన గదర్ 2 తర్వాత మళ్లీ చాలా కాలానికి చేసిన సీక్వెల్ సినిమా ఇది. ఇప్పటికే దీనిపై మంచి బజ్ క్రియేటా కాగా.. తాజాగా స్వాతంత్ర దినోత్సవం కానుకగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దీనితో పాటుగా సినిమా వచ్చే ఏడాది జనవరి 22న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శ కత్వం వహించగా.. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ లు నిర్మాణం వహించారు. వరుణ్ ధావన్, దిల్జీత్సింగ్ ఇతర లీడ్ రోల్స్లో నటించనున్నారు. అహన్ శెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా.. సన్నీ డియోల్, సునీలెశెట్టి, జాకీ ష్రఫ్, అక్షయ్ ఖన్నా లీడ్ రోల్స్లో నటించిన హిందీ 'బోర్డర్' 1997లో విడుదలై బ్లాక్ బాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే.